ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, మరిన్ని సడలింపులు, స్ట్రీట్ ఫుడ్స్ కు పర్మిషన్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4 అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలోనూ లాక్ డౌన్ 4 అమలు చేస్తున్నారు. కాగా

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4 అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలోనూ లాక్ డౌన్ 4 అమలు చేస్తున్నారు. కాగా
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4 అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలోనూ లాక్ డౌన్ 4 అమలు చేస్తున్నారు. కాగా లాక్ డౌన్ 4వ దశలో భారీగా సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం. తాజాగా మరి కొన్నింటికి లాక్‌డౌన్ నిబంధనల నుంచి సడలింపులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
* రాష్ట్రవ్యాప్తంగా నగలు, బట్టలు, చెప్పుల షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి
* స్ట్రీట్ ఫుడ్స్ కు(పార్సిళ్లకు మాత్రమే) సైతం అనుమతి, పానీపూరి షాపులకు అనుమతి లేదు
ఆయా షాపులు అనుసరించాల్సిన విధానాలపై ప్రభుత్వం సర్క్యులర్
* పెద్ద షోరూమ్‌లకు వెళ్లాలంటే ముందే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలి
* అన్ని షాపుల్లో ట్రయల్ రూమ్‌లకు అనుమతి నిరాకరణ
* రోడ్లపై ఆహారం అమ్మేవారు ప్లేట్స్ లలో కాకుండా పార్సిల్ సదుపాయం కల్పించాలని ఆదేశం
* అలాగే ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవాలి
* వీటితో పాటు నగల షాపుల్లో విక్రయించే వారు తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించాలి.
వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిందేనని సీఎం జగన్ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ 4లో దశలవారిగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. అయితే ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు వేసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు. అలా జాగ్రత్తలు పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమని సీఎం తేల్చి చెప్పారు. రెండు నెలల పాటు పూర్తిగా లాక్ డౌన్ విధించడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నిలిచిపోయింది. ప్రజలు కూడా ఉపాధి లేక డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తలు చెబుతూ దశలవారిగా సడలింపులు ఇస్తోంది ప్రభుత్వం.
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48 కొత్త కేసులు నమోదయ్యాయి. 8,148 మంది నమూనాలు పరీక్షించగా.. 48 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,719 కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 57కు చేరింది. కొత్తగా నమోదైన 48 కేసుల్లోనూ కోయంబేడు కాంటాక్టు కేసులు ఉన్నాయి. కొత్త కేసుల్లో నలుగురు కోయంబేడు నుంచి వచ్చిన వారున్నారు. వీరిని చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 55మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,903కి చేరింది. 759 మంది బాధితులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కేసులు వివరాలు మాత్రం ఇవ్వలేదు.
Read: మహానాడుకు ముందు బాబుకు షాక్ : టీడీపీ నుంచి వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్