Tenth Exams : బ్రేకింగ్.. ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

Tenth Exams
Tenth Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ చేపట్టగా ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
దీంతో పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని ప్రభుత్వం తెలిపింది. టీచర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాలు కోరిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది. కాగా, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం జూలైలో మళ్లీ సమీక్షించనుంది.