కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు విషయంలో ఏపీ సర్కార్ సీరియస్

contract employees : కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఉద్యోగుల కొనసాగింపుపై అన్ని శాఖలు వివరాలు పంపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖలు, జిల్లాల వారీగా వివరాలు కోరింది. ఉద్యోగుల కొనసాగింపుపై కొన్ని శాఖలు వివరాలు సమర్పించాయి. మరికొన్ని శాఖలు పూర్తి వివరాలు అందించలేదు.
విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, యువజన సర్వీసుల శాఖ, న్యాయశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే కొనసాగించాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా మిగిలిన శాఖలు, జిల్లాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగించొద్దని ఆదేశాలు జారీ చేసింది.
మిగిలిన శాఖలు, జిల్లాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగించేందుకు ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. ఆర్థికశాఖ అనుమతి ఉన్న ఉద్యోగులను మార్చి 31 వరకు కొనసాగించేలా జీవో విడుదల చేసింది.