AP High Court : దేశ రాజధాని ఢిల్లీ…అంటే మిగతా ప్రాంతాల వారికి భాగస్వామ్యం లేదా ?
ఢిల్లీ ఒక్కటే దేశ రాజధాని...అంటే మిగతా ప్రాంతాల వారికి భాగస్వామ్యం లేదా ? అంటూ ప్రశ్నించింది.

Amaravathi
Capital Amaravati : ఏపీ అమరావతి రాజధానిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తోంది. రాజధానిపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021, నవంబర్ 18వ తేదీ…గురువారం నాలుగో రోజు కోర్టులో వాదనలు జరిగాయి. ఢిల్లీ ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ఒక్కటే దేశ రాజధాని…అంటే మిగతా ప్రాంతాల వారికి భాగస్వామ్యం లేదా ? అంటూ ప్రశ్నించింది. రాజధాని ఒకేచోట ఉంటే ప్రజలకు భాగస్వామ్యం లేదనడం సరైన సమాధానం కాదని ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
Read More : Alcohol testing in car : మద్యం తాగి కారు ఎక్కితే స్టార్ అవ్వదు..మందుబాబులకు..షాకే..
రాజధాని నిర్ణయంపై వ్యతిరేకత వచ్చిందనడంపై ఎలాంటి ఛాలెంజ్ లేదని, అప్పటి ప్రభుత్వం అమరావతిపై తీసుకున్న నిర్ణయం సబబే అని…పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అభివృద్ధి కేంద్రీకరణ అనేది సమంజసమేనని, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినవి సిఫార్సులని పాటించాలని లేదని తెలిపారు. కోర్టులో సీనియర్ న్యాయవాదులు బి.ఆదినారాయణ, ఉన్నవ మురళీధరరావు వాదనలు వినిపించారు. వాదనలు అనంతరం విచారణనను 2021, నవంబర్ 19వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది.
Read More : CBDT : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు రీఫండ్
గత టీడీపీ ప్రభుత్వం…అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తూ..నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. ముఖ్యంగా పాలనా రాజధాని విశాఖలో పెట్టే పనులను ముమ్మరం చేసింది. త్వరలో విశాఖ పాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్‌గా వెంటనే అమల్లోకి తీసుకుని రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం చట్టం కూడా చేయగా.. కేంద్రం ప్రభుత్వం నుంచి పాలన అనుమతులు రావాల్సి ఉంది.
Read More : Heavy Rains In Kadapa : కడప జిల్లాలో భారీ వర్షాలు.. వరద నీటిలో చిక్కుకున్న వాహనాలు
అయితే..ఈ విషయంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. ఈ లెక్కన అమరావతి.. రైతులకు మాత్రమే రాజధాని కాదని.. అది ఆంద్రప్రదేశ్ లోని ప్రజలందరి రాజధాని అని చెప్పారు. రాష్ట్ర రాజధాని అంటే కర్నూలు ప్రజలకు, వైజాగ్ ప్రజలకు.. అలా అన్ని జిల్లాల ప్రజలకు చెందినదని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటం.. వారి కోసం వారు చేసింది కాదని.. అది దేశ ప్రజలందరి కోసం చేసినదని అన్నారు.