Taneti Vanitha: ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఔదార్యం: యాక్సిడెంట్ బాధితులకు దగ్గరుండి సహాయం చేసిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి స్వయంగా దగ్గరుండి సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు

Taneti Vanitha: ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఔదార్యం: యాక్సిడెంట్ బాధితులకు దగ్గరుండి సహాయం చేసిన మంత్రి

Taneti

Updated On : April 27, 2022 / 11:36 PM IST

Taneti Vanitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు మంత్రి స్వయంగా దగ్గరుండి సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈఘటనలో బైక్ పై వెళుతున్న దంపతులు స్వల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో హోంమంత్రి తానేటి వనిత తన కాన్వాయితో సహా అటుగా వెళ్తూ..ప్రమాదాన్ని గమనించారు.

Also read:CM Jagan : ముగిసిన సీఎం జగన్ కీలక సమావేశం.. నేతలకు దిశానిర్దేశం

వెంటనే కాన్వాయిని ఆపించిన మంత్రి..ప్రమాద బాధితుల వద్దకు వెళ్లి సహాయం అందించారు. మంత్రి వనిత స్వయంగా అంబులెన్సుకి ఫోన్ చేసి సమాచారం అందించి..ప్రమాద బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన దంపతులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదం పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదాన్ని గమనించిన మంత్రి వనిత..వెంటనే స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Also read:CM Ys Jagan: వైసీపీ నేతలతో జగన్ భేటీ