ఏపీ శాసనసభ సమావేశాల్లో నేడు కీలక బిల్లులు.. సాయంత్రం క్యాబినెట్‌ భేటీ

పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది రాష్ట్ర మంత్రివర్గం.

ఏపీ శాసనసభ సమావేశాల్లో నేడు కీలక బిల్లులు.. సాయంత్రం క్యాబినెట్‌ భేటీ

Ap Assembly

Updated On : November 20, 2024 / 7:53 AM IST

నేడు జరగనున్న ఏపీ శాసన సభ ఏనిమిదో రోజు సమావేశాల్లో అసెంబ్లీ ఆర్థిక కమిటీలైన ప్రజాపద్దులు(పీఏసీ), అంచనాల కమిటీ(ఎస్టిమేట్స్‌), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) లకు సభ్యుల ఎన్నికపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీల్లో తొమ్మిది మంది చొప్పున ఎమ్మెల్యేలను ఎన్నుకోనుంది శాసనసభ.

ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను స్పీకర్ వెల్లడించనున్నారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో క్యాబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సీఎం సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి నేడు సంతాపం తెలపనుంది శాసనసభ.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి 150 రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం అమలు అనే అంశంపై నేడు అసెంబ్లీలో 344 నిబంధన కింద ప్రత్యేక చర్చ జరగనుంది. రుషికొండ ప్యాలెస్‌ అక్రమ నిర్మాణాలపై అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్ర నూతన ఎక్సైజ్‌ విధానంపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రకటన చేస్తారు.

వీటిపై కూడా చర్చ

  • ద్రవ్య వినిమయ బిల్లు-2024ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌
  • పెండింగ్ లో ఉన్న మూడు ఎక్సైజ్ , మున్సిపల్ శాఖ చట్టసవరణ బిల్లులకు నేడు అసెంబ్లీ ఆమోదం
  • అసెంబ్లీలో నేటి ప్రశ్నోత్తరాలు.. ఇళ్ల స్థలాల్లో అవకతవకలు, ఐస్ లైండ్ రిఫ్రిజరేటర్ల కోనుగోళ్లు, ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ లు, గోదావరి పుష్కరాలు
  • ఆదోనిలో ఆటోనగర్ అభివృద్ధి తదితర అంశాలపై చర్చకు మంత్రులు సమాధానాలు
  • ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, విశాఖ డైరీ, రాష్ట్రంలో క్రీడామైదానాలు, పేదలందరీకి ఇళ్లు, రాష్ట్రంలో జనరిక్ మందులు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది రాష్ట్ర మంత్రివర్గం. 85వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, 34వేల మందికి ఉద్యోగాలు కల్పించే 10భారీ సంస్థల స్థాపనకు నిన్న ఎస్ఐపీబీలో ఆమోదం తెలుపుతారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు నేటి మంత్రి వర్గంలో ఆమోద ముద్ర వేస్తారు. రాజధాని అమరావతికి గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనుల టెండర్లును రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై మంత్రివర్గంలో చర్చ, నిర్ణయం తీసుకుంటారు.

Maharashtra Polls 2024: మహారాష్ట్రలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్