పంతం నీదా..నాదా : శాసన మండలి భవిష్యత్ తేలేది సోమవారం

శాసనమండలి భవితవ్యం తేలేది 2020, జనవరి 27వ తేదీ సోమవారం. ఆ రోజు ప్రత్యేకంగా సమావేశమై మండలిపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు స్పీకర్ తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. దీంతో శుక్ర, శనివారాలు సభకు హాలీడే ఇచ్చి..తిరిగి సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశమౌతుందని వెల్లడించారు స్పీకర్ తమ్మనేని. దీంతో సోమవారం నాడు జరిగే సమావేశంలో మండలి రద్దుపై కీలక నిర్ణయం తీసుకొననున్నారు.
మండలి రద్దుకే సీఎం జగన్, మెజార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నారు. మండలి అవసరం ఏంటీనే ప్రశ్న లేవనెత్తారు సీఎం జగన్. మండలి సభను నిర్వహించడం మూలంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. 2020, జనవరి 23వ తేదీ గురువారం నాలుగో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. పలు బిల్లులను ఆమోదించిన అనంతరం సాయంత్రం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై చర్చించారు.
ఈ సమావేశానికి టీడీపీ దూరంగా ఉంది. వైసీపీ సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. మండలి ఉండడం ప్రజలకు మేలు జరుగుతుందా ? లేదా ? అనేదానిపై సుదీర్ఘంగా ఆలోచించాలన్నారు. శనివారాలు హాలీడేస్ ఇచ్చి..సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కొనసాగించే విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇంగ్లీషు మీడియం బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడం ఆశ్చర్యమేస్తుందన్నారు. పేదవాడు ప్రపంచంతో పోటీ పడేందుకు తీసుకొస్తున్న ఈ బిల్లు ముందుకు రాకుండా ప్రయత్నించడం దారుణమన్నారు. మండలిలో ఒక రకంగా..శాసనసభలో ఒక రకంగా టీడీపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ దురుద్దేశ్యంతో వ్యవహరిస్తున్న తీరు, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.
Read More : అసలే పేద రాష్ట్రం : మండలిని రద్దు చేసేద్దాం – సీఎం జగన్