AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డికి రిమాండ్..

మద్యం కుంభకోణంలో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు న్యాయాధికారి.

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డికి రిమాండ్..

AP Liquor Scam Case

Updated On : May 17, 2025 / 11:39 PM IST

ఏపీ లిక్కర్ కేసులో A 31 ధనుంజయ రెడ్డి, A 32 కృష్ణమోహన్ రెడ్డి కి కోర్టు రిమాండ్ విధించింది. మే 20వ తేదీ వరకు వారికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు నిందితులు ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సుమారు మూడు గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదులు
వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. మద్యం కుంభకోణంలో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు న్యాయాధికారి. దీంతో పోలీసులు నిందితులను విజయవాడ జిల్లా జైలుకి తరలించారు.

Also Read: దేశద్రోహులు..! భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం.. లేడీ యూట్యూబర్ సహా ఆరుగురు అరెస్ట్..

కాగా వయసు రీత్యా ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది. వెస్ట్రన్ కమోడ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్ కు అనుమతి ఇచ్చింది. ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని ఆదేశించింది.