AP Liquor Scam: ఆ డబ్బునే ఎన్నికల్లో వాడారు, విదేశాలకు పారిపోయే వారు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలు..

తరలించిన డబ్బును హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేర్చారు. తాడేపల్లి నుంచి నెల్లూరు, ప్రకాశం, తిరుపతికి వేర్వేరు వాహనాల్లో డబ్బు తరలించారు.

AP Liquor Scam: ఆ డబ్బునే ఎన్నికల్లో వాడారు, విదేశాలకు పారిపోయే వారు- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలు..

Updated On : June 18, 2025 / 8:21 PM IST

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలు వెల్లడించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని తెలిపింది. విచారణ జరుగుతుందని తెలిసిన వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోయేందుకు యత్నించారంది. లిక్కర్ ద్వారా వచ్చిన సొమ్మును 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి ఖర్చు చేశారంది. చాలా నియోజకవర్గాల్లో రాజకీయ లబ్ది కోసం ఈ డబ్బును పంపిణీ చేశారని సిట్ తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి డబ్బు ఎలా తీసుకురావాలి? ఎక్కడెక్కడ, ఎవరెవరికి పంచాలో చెవిరెడ్డే నిర్ణయించారంది.

చాలా నియోజకవర్గాలకు చెవిరెడ్డి ద్వారా డబ్బులు పంపిణీ జరిగింది. చట్ట విరుద్ధంగా లిక్కర్ కేసులో డబ్బు తరలించారు. గత ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకుని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి డబ్బు తరలించింది. చెవిరెడ్డిని విచారణ చేసిన తర్వాత అన్ని కోణాల్లో ఆయన పాత్ర ఉందని స్పష్టంగా తేలింది. ఈ కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేయకపోతే విదేశాలకు పరారయ్యే వారు. లిక్కర్ కేసులో జరిగిన 3500 కోట్ల అవకతవకల్లో 200-250 కోట్లను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనాల ద్వారా తరలించి ఎన్నికల్లో పంచారు. డిస్టిలరీలా ద్వారా నగదును తరలించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడ్డారు.

లిక్కర్ కేసులో ఎ1, ఎ8, ఎ30, ఎ34, ఎ35, ఎ36, ఎ37, ఎ 39 అందరూ కలిసి డబ్బు తరలించారు. తరలించిన డబ్బును హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేర్చారు. తాడేపల్లి నుంచి నెల్లూరు, ప్రకాశం, తిరుపతికి వేర్వేరు వాహనాల్లో డబ్బు తరలించారు. ఈ డబ్బు తరలించడానికి ఏ38 గా ఉన్న చెవిరెడ్డి తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు అధికారిక వాహనాలు వాడారు. సాధారణ ఎన్నికలకు ముందే 8 కోట్ల రూపాయలను గరికపాడు చెక్ పోస్ లో పట్టుకున్నారు. ఈ కేసులో ఏ36 ఏ37గా ఉన్న ఇద్దరు నిందితులే ఆ డబ్బు తరలించారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్.. వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి చెప్పారు.. ఫోన్ సంభాషణ నాకే వినిపించారు..!

ఈ డబ్బుతోనే ఓటర్లను కొనుగోలు చేసేందుకు యత్నించారు. చట్ట విరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఎన్నికల్లో ఈ మద్యం డబ్బునే వాడారు. అన్ని కోణాల్లో విచారణ చేసిన తర్వాత డబ్బు తరలించడానికి యత్నించిన ఫొన్ లొకేషన్లు ఒకే ప్రాంతంలో చూపించాయి. టోల్ ప్లాజా సీసీ కెమెరాల్లో ఆ వాహనాల్లో వీరే వెళ్తున్నట్లు రికార్డ్ అయ్యింది. నేరపూరిత కుట్రలకు పాల్పడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని” రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్.