ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్.. వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి చెప్పారు.. ఫోన్ సంభాషణ నాకే వినిపించారు..!

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్.. వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి చెప్పారు.. ఫోన్ సంభాషణ నాకే వినిపించారు..!

YS Sharmila

Updated On : June 18, 2025 / 2:41 PM IST

YS Sharmila: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది ముమ్మాటికీ నిజమని అన్నారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

2018-19 పొలిటికల్ టైమ్‌లో తెలంగాణా సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా జగన్ ఉన్నపుడు చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ టాపింగ్ జరిగింది అన్నది ముమ్మాటికీ నిజం. తెలంగాణ సీఎం, ఏపీ సీఎం జాయింట్ ఆపరేషన్ ఇది. నా ఫోన్, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుందని స్పష్టంగా అర్ధమైంది. వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వచ్చి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయ్ అని నాతో చెప్పారు. ఫోన్ సంభాషణ నాకే వినిపించారు. ఈ విషయం సుబ్బారెడ్డి ఒప్పుకుంటారా అంటే నాకు అనుమానమే. ఏ విచారణకు అయిన.. బైబిల్ మీద, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలను అని షర్మిల అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ ఆడియోలు నాకే వినిపిస్తే ఇది ఇల్లీగల్ కూడా. అప్పట్లో ఏపీలో, తెలంగాణలో ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం చిన్నదిగా అనిపించింది.. అందుకే చెప్పలేకపోయాను. నా రాజకీయ భవిష్యత్ నాశనం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. నాకు అండగా నిలబడ్డ వారిని బెదిరింపులకు గురిచేశారు. జగన్ మోహన్ రెడ్డి నేను ఊపిరి తీసుకోవడమే కష్టంగా చేశారని షర్మిల అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం. అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు చేయడానికి సిద్ధం. ఏ ఎంక్వైరీకైన సిద్ధంగా ఉన్నాను. నేను ఫిర్యాదు చేయాలని అనుకుంటే నా ఫోన్ ట్యాప్ అయిందని తెలిసిన రోజే ఫిర్యాదు చేసేదాన్ని. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ పూర్తిస్థాయిలో జరగాలని షర్మిల అన్నారు.