జగనన్న గోరుముద్ద : మిడే డే మీల్..రోజుకో రుచి

ఏపీ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకొస్తున్నామని సీఎం జగన్ శాసనసభలో వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరిగా తప్పులు చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెట్టే ఆహార భోజనంలో మార్పులు చేశామని, రోజుకో రుచితో భోజనం పెడుతామన్నారు సీఎం జగన్. 2020, జనవరి 21వ తేదీ మంగళవారం అమ్మ ఒడి పథకంపై ఆయన మాట్లాడారు.
పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు, నాణ్యమైన చదువును అందిస్తే..వాళ్లు ఉన్నతమైన స్థాయికి వెళుతారని సభలో తెలిపారు. గోరుముద్ద పేరిట మధ్యాహ్న భోజన పథకం అందిస్తామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమం అమ్మ ఒడి. మధ్యాహ్న భోజన పథకానికి అదనంగా రూ. 344 కోట్లు ఖర్చవుతాయని సభ దృష్టికి తీసుకొచ్చారు.
క్వాలిటీలో మాత్రం ప్రభుత్వం కఠినంగా ఉంటుందని, ఒక ఫోర్ లెవల్స్ సిస్టంను ఇందులో తీసుకొస్తామన్నారు. పేరెంట్ కమిటీ నుంచి ముగ్గురిని ఎంపిక చేసి మధ్యాహ్న భోజన పథకం తీరుపై పరిశీలన చేయడం జరుగుతుందన్నారు.
జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :-
* ఈ సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు.
* తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్.
* ఇంగ్లీషు మీడియంపై టీచర్లకు ప్రత్యేక శిక్షణ.
* ఇంగ్లీషు మీడియం వల్ల పిల్లల జీవితాలు బాగు పడుతాయి.
* భవిష్యత్‌లో ఉద్యోగాలు సులభంగా లభించే అవకాశం.
* అంతర్జాతీయ ప్రమాణాలతో సిలబస్ తయారీ.
* బ్రిడ్జీ కోర్సులను అందిస్తాం.
* స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన.
* విద్యా కానుక పథకం కింద జూన్ 01న ప్రతి పిల్లాడికి ఒక కిట్.
* కిట్‌లో బ్యాగు, బుక్స్, బూట్లు, బట్టలు.
* నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం.
Read More : శాసనమండలిని రద్దు ఎలా చేస్తారో చెప్పిన మైసురా