Power Crisis : తెలంగాణ.. బొగ్గు నిల్వలు ఏపీకి ఇవ్వడం లేదు

దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా కొన్ని రోజుల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడబోతోందని, ఫలితంగా అంధకారం నెలకొంటుందనే ప్రచారం జరుగుతోంది.

Power Crisis : తెలంగాణ.. బొగ్గు నిల్వలు ఏపీకి ఇవ్వడం లేదు

Ap Power Crisis

Updated On : October 12, 2021 / 6:47 PM IST

Power Crisis : దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా కొన్ని రోజుల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడబోతోందని, ఫలితంగా అంధకారం నెలకొంటుందనే ప్రచారం జరుగుతోంది.

ఇంధన సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ రంగ సమస్యలు తీవ్రతరం కాగా, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో కరెంటు కోతలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. విద్యుత్ సంక్షోభం పై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. బొగ్గు కొరత దేశవ్యాప్తంగా ఉందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని, ఏపీలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని వివరించారు.

Lifespan: ఇది తింటే.. మీ జీవితంలో 36నిమిషాలు తగ్గిపోయినట్లే

బొగ్గు కొరత దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ రంగంలో నెలకొన్న ఒడిదుడుకులు తొందరలోనే తొలగిపోతాయని స్పష్టం చేశారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. జెన్ కో కేంద్రాలను అనాలోచితంగా మూసివేయలేదని చెప్పారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే వేలం ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని బాలినేని వివరించారు.

బొగ్గు కొరత కారణంగా యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఉందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాయలసీమ థర్మల్ ప్లాంట్ లో వార్షిక మరమ్మతులు చేపట్టామని వివరించారు. బొగ్గు కొరత వల్ల ఎలాగూ థర్మల్ యూనిట్లను మూసివేయాల్సి వచ్చేదన్నారు.

Digestive : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటం లేదా?..అయితే ఇలా ప్రయత్నించి చూడండి…

కాగా.. తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదని, అక్కడున్న బొగ్గు నిల్వలను ఏపీకి ఇవ్వడం లేదని మంత్రి బాలినేని ఆరోపించారు. “మనం శ్రీశైలంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని మనవి చేస్తున్నా” అంటూ మంత్రి ట్వీట్ చేశారు.

దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు కరెంట్‌ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం దగ్గరున్న ‘కేటాయించని విద్యుత్‌’ను వాడుకోవాలని తెలిపింది. అలాగే, మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్‌’ సాయం చేయాలని కోరింది.