Minister Kakani : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కావాలా? మంత్రి పదవి కావాలా? అని అడిగితే.. తాను నియోజకవర్గ అభివృద్ధినే కోరుకుంటానన్నారు.

Minister Kakani : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kakani

Updated On : April 20, 2022 / 6:31 PM IST

Kakani Key comments : సీఎం జగన్‌తో సమావేశానికి రాకముందు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు కొంతమంది అనేక ప్రయత్నాలు చేశారన్నారు. పనికట్టుకుని తనపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కావాలా? మంత్రి పదవి కావాలా? అని అడిగితే.. తాను నియోజకవర్గ అభివృద్ధినే కోరుకుంటానన్నారు.

కొన్నాళ్లుగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కాకాణి, అనిల్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవలే ఒకేరోజు ఇద్దరు కూడా పోటాపోటీగా సభలు నిర్వహించారు. వారి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేసుకునే పరిస్థితి కనిపించింది. దీంతో వారిద్దరిని సీఎం జగన్, క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు. సీఎం జగన్ తో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విడి విడిగా సమావేశం అయ్యారు. మొదటగా మాజీ అనిల్ కుమార్, ఆ తర్వాత మంత్రి కాకాణి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఎవరి వర్షన్ వారు సీఎం జగన్ కు చెప్పుకున్నారు.

CM Jagan : నెల్లూరు వైసీపీ నేతల మధ్య విభేదాలపై సీఎం జగన్ సీరియస్‌

మరోవైపు నెల్లూరు వైసీపీ నేతల పంచాయితీపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. కొన్నాళ్లుగా ఉప్పు నిప్పులా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఇద్దరినీ పిలుపుంచుకున్న జగన్.. వాళ్లిద్దరికీ క్లాస్ తీసుకున్నారు. బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదంటూ నేతలకు క్లాస్ తీసుకున్నారు.

వివాదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటూనే.. ఏమైనా ఇబ్బందులుంటే తనతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీలో సీనియర్లైన మీరే ఇలా చేస్తే ఎలా అంటూ కాస్త ఘాటుగానే మందలించినట్లు తెలుస్తోంది. అందరూ కలిసి పని చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని కాకాణి, అనిల్‌కు జగన్ సూచించారు.