PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన నారా లోకేశ్ భేటీ.. దాదాపు 2 గంటల పాటు చర్చలు….
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ గురించి మోదీకి వివరించారు.

PM Modi: ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు వీరి భేటీ కొనసాగింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు నారా లోకేశ్. ప్రధానితో భేటీలో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పైనే చర్చించినట్లు సమాచారం. ఇక, ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై లోకేశ్ ప్రధానికి అభినందనలు తెలియజేశారని తెలుస్తోంది.
ఏపీలో ఇటీవల ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్, ఇతర పాలనా సంస్కరణల గురించి మోదీకి వివరించారట లోకేశ్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ గురించి మోదీకి వివరించారట. పోలవరం, అమరావతికి కేంద్ర మంత్రిత్వ సహకారంపై కృతజ్ఞతలు తెలిపారు లోకేశ్.
Also Read: మహానాడు తర్వాత నారా లోకేశ్‌కు కీలక పదవి?
ఏపీలో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు, కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలుపైనా మోదీతో మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలతో పెట్టుబడుల కోసం జరుపుతున్న చర్చల వివరాలను ప్రధానికి వివరించారు లోకేశ్.