Minister Roja: జగన్‌ను మోసం చేసిన వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు ..
తన భార్యని తిట్టారని అబద్ధాలుచెప్పి ఏడ్చిన చంద్రబాబు, మళ్లీ సీఎం అయిన తరువాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడని, కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు అసెంబ్లీలోకి వచ్చారంటూ రోజా ప్రశ్నించారు. అంటే తన భార్య పరువు పోయినా పర్లేదు, తన నీచ రాజకీయంకోసం వచ్చారాఅని రోజా అన్నారు.
Minister Roja: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ (YCP) కి షాక్ తగిలింది. ఏడు స్థానాల్లో టీడీపీ (TDP) అనూహ్య రీతిలో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి తమ ఓటు వేసినట్లు స్పష్టమైంది. వారిలో ఎవరనేది బహిర్గతం కాలేదు. ఈ క్రమంలో ఏపీ మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరంలో హాట్ కామెంట్స్ చేశారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) ని ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టం జరుగుతుంది, జగన్‌కు, వైసీపీ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని రోజా అన్నారు.
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సీటు లేదని తెలిసి వెళ్లినట్లున్నారని, వాళ్లకి ఏ పార్టీలో సీటు ఇచ్చిన ప్రజలు ఓడిస్తారని చెప్పారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో అందరికీ తెలుసు, వారికి రాజకీయ భవిషత్తు ఉండదంటూ రోజా వ్యాఖ్యానించారు. జగన్‌ను మోసం చేసిన వాళ్ళు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని రోజా హెచ్చరించారు. చరిత్రను ఒక్కసారి తిరగేసుకుంటే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. డబ్బు ముఖ్యం కాదు, ప్రజల్లో అభిమానం, ఆదరణ ఉండాలి అన్నారు. నాలుగు ఎమ్మెల్సీలు వస్తే చంకలు గుద్దుకుని సంబరు పడిపోతున్నారు, వాళ్లు ఎంత పిచ్చోల్లో అర్థం అవుతుందని రోజా టీడీపీ శ్రేణులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
తన భార్యని తిట్టారని అబద్ధాలు చెప్పి ఏడ్చిన చంద్రబాబు, మళ్లీ సీఎం అయిన తరువాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడని, కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఎందుకు అసెంబ్లీలోకి వచ్చారంటూ రోజా ప్రశ్నించారు. అంటే తన భార్య పరువు పోయినా పర్లేదు, తన నీచ రాజకీయంకోసం వచ్చారా అంటూ రోజా ప్రశ్నించారు. జగన్ మోహన్‌రెడ్డి ఎజెండా ఒకటేనని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని రోజా దీమా వ్యక్తం చేశారు.