Ministers Gudivada Dadisetti : జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం, నమ్మకాన్ని వమ్ము చేయం- మంత్రులు గుడివాడ, దాడిశెట్టి రాజా
ఉత్కంఠకు తెరపడింది. ఏపీ కొత్త మంత్రివర్గ జాబితా విడుదల అయ్యింది. 25 మందితో జాబితా..(Ministers Gudivada Dadisetti)

Ministers Gudivada Dadisetti
Ministers Gudivada Dadisetti : ఉత్కంఠకు తెరపడింది. ఏపీ కొత్త క్యాబినెట్ రూపుదిద్దుకుంది. కొత్త మంత్రివర్గ జాబితా విడుదల అయ్యింది. 25 మందితో నూతన మంత్రివర్గ జాబితాను ఖరారు చేశారు సీఎం జగన్. ఇందులో పలువురు సీనియర్ మంత్రులకు మరో అవకాశం ఇచ్చారు జగన్.
10 మంది పాత మంత్రులు, 15 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ కూర్పు చేశారు. బొత్స సత్యానారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, రాజన్నదొరకు చోటు దక్కింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు దాడిశెట్టి రాజా. మంత్రివర్గంలో తనకు చోట ఇచ్చిన సీఎం జగన్ కు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారాయన.(Ministers Gudivada Dadisetti)
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం నుంచి దాడిశెట్టి రాజాకు మంత్రిగా అవకాశం దక్కింది. తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజికవర్గం నుంచి దాడిశెట్టికి మినిష్టర్ గా ఛాన్స్ దక్కింది. తనకు అవకాశం ఇచ్చిన జగన్ కు దాడిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. తుని నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేస్తానని ఆయన చెప్పారు. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ను వీడి వెళ్లలేదన్నారు. జగన్ మన్ననలు పొందేలా పని చేస్తానని వెల్లడించారు.(Ministers Gudivada Dadisetti)
AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్ జాబితా విడుదల.. కొత్త మంత్రులు వీరే
జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట ఉన్నానని కేబినెట్ లో చోటు దక్కించుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడ్డాని చెప్పారు. కేబినెట్ లో అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం జగన్ కు రుణపడి ఉంటానన్నారు. ఆయన ఏ స్థానం ఇచ్చినా ఒక సైనికుడిలా పని చేస్తాను అన్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు జగన్ కోసం పని చేస్తానని తెలిపారు. రాష్ట్రం కోసం జగన్ పడుతున్న తపనలో తానూ భాగస్వామ్యం అవుతాను అన్నారు.(Ministers Gudivada Dadisetti)
బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, అంజాద్ బాషా, నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్ కొత్త మంత్రివర్గంలోనూ స్థానం సంపాదించుకున్నా, వారికి ఏ శాఖలు కేటాయిస్తారన్నది తెలియాల్సి ఉంది. కాగా, కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించిన వారిలో రోజా, అంబటి రాంబాబు, జోగి రమేశ్ తదితరులు ఉన్నారు.
కాగా, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్, కన్నబాబు తమ మంత్రి పదవులను నిలుపుకోలేకపోయారు. వారికి తాజా మంత్రివర్గంలో స్థానం లభించలేదు.
నూతన మంత్రివర్గంలో ఉన్నది వీరే..
1. బొత్స సత్యనారాయణ
2. సీదిరి అప్పలరాజు
3. ధర్మాన ప్రసాదరావు
4. పీడిక రాజన్నదొర
5. గుడివాడ అమర్నాథ్
6. బూడి ముత్యాలనాయుడు
7. దాడిశెట్టి రాజా
8. పినిపే విశ్వరూప్
9. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Ministers Gudivada Dadisetti)
10. తానేటి వనిత
11. కారుమూరి నాగేశ్వరరావు
12. కొట్టు సత్యనారాయణ
13. జోగి రమేశ్
14. అంబటి రాంబాబు
15. మేరుగ నాగార్జున
16. కాకాణి గోవర్ధన్ రెడ్డి
17. అంజాద్ బాషా
18. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
19. గుమ్మనూరు జయరాం
20. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
21. నారాయణస్వామి
22. రోజా
23. ఉషాశ్రీ చరణ్
24. ఆదిమూలపు సురేశ్
25. విడదల రజని