Andhra Pradesh : కార్లు అద్దెకు తీసుకుంటారు..తనఖా పెట్టేస్తారు..

Andhra Pradesh : కార్లు అద్దెకు తీసుకుంటారు..తనఖా పెట్టేస్తారు..

Cars

Updated On : June 11, 2021 / 4:46 PM IST

Andhra Pradesh : అతి తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించేయాలనే దురాశతో కొంతమంది కేటుగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు ఏపీ పోలీసులు. అద్దెకు కార్లు తీసుకుని వారిని మరొకరికి తనఖా పెట్టేసి డబ్బులు దండుకునే ముఠాకు విజయనగరం పోలీసులు అరదండాలు వేశారు. ముగ్గురువ్యక్తులు ముఠాగా ఏర్పడి కొన్ని కంపెనీల నుంచి కార్లు అద్దెకు తీసుకుని వాటిని తనఖాలు పెడుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అద్దెకు తీసుకున్న కార్లను తనఖాలు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు కార్లు చోరీలు చేసి వాటిని తనఖా పెడుతుంటారు. ఈ ముఠా మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 29 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆ కార్ల విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచానా వేశారు.ఈ ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు పార్వతీపురానికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.