ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ షీట్లు.. 17వరకు అభ్యంతరాల స్వీకరణ
ఏపీలో కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ఆర్.కె. మీనా ఫలితాలను విడుదల చేశారు.

AP police constable final results released
AP Police: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ – 2025 తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ ఆర్.కె. మీనా ఫలితాలను విడుదల చేశారు. పోలీసు కానిస్టేబుల్ సివిల్, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షలకు మొత్తం 37,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 33,921 మంది (పురుషులు 29,211, మహిళలు 4,710) అర్హత సాధించారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.slprb.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. మీరు నేరుగా ఫలితాలను చూడాలనుకుంటే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఫలితాల్లో పేర్లు కనిపించే అభ్యర్థులు పరీక్షల్లో అర్హత సాధించినట్లు లెక్క. కానిస్టేబుల్ పదవికి ఎంపికైనట్లు.
తుది కీలో అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యర్థనలను పరిశీలించి దిద్దుబాటు చేసినట్లు రాజీవ్ కుమార్ మీనా ప్రకటించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచామని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. ఈనెల 11 నుంచి 17 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
ఫలితాలను ఇలా చూసుకోండి..
♦ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితం 2025ను అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ లో ఉంచారు.
♦ వెబ్ సైట్ లోకి వెళ్లి Final Written Test Results for the post of SCT PC (Civil) and SCT PC (APSP) పై క్లిక్ చేయండి.
♦ లాగిన్ అడుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
♦ రిజల్ట్ మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్ లేదా పేరు ఉపయోగించి ఫలితం చూసుకోవచ్చు.
♦ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు తరువాత దశకు అర్హత సాధించినట్లు లెక్క. జాబితాలో పేర్లు లేని వాళ్లు అర్హత సాధించలేదని అర్ధం.