Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసుల విస్తృత గాలింపు..

తనకు వచ్చిన నోటీసులకు లీగల్ గా సమాధానం ఇచ్చినట్లు తెలిపిన వర్మ..

Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసుల విస్తృత గాలింపు..

Ram Gopal Varma Case (Photo Credit : Google)

Updated On : November 27, 2024 / 9:19 PM IST

Ram Gopal Varma : సోషల్ మీడియాలో పోస్టుల కేసుకు సంబంధించి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. హైదరాబాద్, తమిళనాడులోని కోయంబత్తూరులో గాలిస్తున్నారు. మరోవైపు వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, ఒంగోలు, విశాఖలో నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఈ కేసులపై వర్మ స్పందించారు. కేసులకు తాను ఏడ్వటం లేదని, వణికిపోవటం లేదని చెప్పుకొచ్చారు. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. తనకు వచ్చిన నోటీసులకు లీగల్ గా సమాధానం ఇచ్చినట్లు తెలిపిన వర్మ.. సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్లే విచారణకు హాజరుకాలేదని వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో పోస్టుల కేసులో నోటీసులపై వర్మ మరోసారి స్పందించారు. మరో వీడియో వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో కామెంట్ చేసే వారిని అరెస్ట్ చేస్తే.. 80 శాతం నుంచి 90 శాతం మంది జైల్లోనే ఉంటారని ఆర్జీవీ అన్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఒంగోలు, విశాఖ, గుంటూరులో కేసులు నమోదయ్యాయి. దీనిపై వర్మ ఘాటుగానే స్పందించారు. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ ఓ వీడియో విడుదల చేశారు. తాను పరారీలో లేనని ఆయన స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, అందుకే పోలీసుల ఎంక్వైరీకి రాలేకపోయానని వర్మ వెల్లడించారు.

తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వర్మ రీసెంట్ గా ఒక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ కేసులకు నేనేమీ వణికిపోవడం లేదు. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్ వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయట. నేను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్ లో ఉన్నా. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నా’ అని ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు వర్మ.

Also Read : ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు..! ఆ రెండు ప్రాంతాలకు ఐఎండీ రెడ్ అలర్ట్..