TDP: సంక్రాంతికి టీడీపీ ఫస్ట్‌ లిస్ట్‌.. ఇటు చంద్రబాబు, అటు లోకేశ్ వద్దకు నేతలు..

హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీలో ఉండవల్లి నివాసంలో నారా లోకేశ్ అభ్యర్థుల విషయంపై...

TDP: సంక్రాంతికి టీడీపీ ఫస్ట్‌ లిస్ట్‌.. ఇటు చంద్రబాబు, అటు లోకేశ్ వద్దకు నేతలు..

Chandrababu Naidu

Updated On : January 13, 2024 / 4:33 PM IST

TDP First List: ఏపీ ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సమయంలో టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీలో ఉండవల్లి నివాసంలో నారా లోకేశ్ అభ్యర్థుల విషయంపై కసరత్తులు చేస్తున్నారు. ఉండవల్లి నివాసం వద్దకు ఆశావాహులు భారీగా వస్తున్నారు. లోకేశ్‌ను కలిసేందుకు మాజీ మంత్రి శనక్కాయల అరుణ వచ్చారు. తన కోడలు డాక్టర్ రాజకుమారికి గుంటూరు పశ్చిమ సీటుని ఆశిస్తున్నారు.

అరుణ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అలాగే, నారా లోకేశ్‌తో ఏలూరు టీడీపీ ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణయ్య సమావేశమయ్యారు. ఏలూరు స్థానం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోన్న వేళ లోకేశ్‌ని రాధాకృష్ణయ్య కలిశారు.

కాగా, ఏపీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం సీట్ల విషయంపైనే దృష్టి పెట్టాయి. టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తుండడంతో సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చాయి.

.

Also Read: రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఘన స్వాగతం