AP Corona Cases : ఏపీలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కేసులు.. ఆ రెండు జిల్లాల్లో వెయ్యికిపైగా నమోదు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 4వేల 528 కేసులు నమోదవగా ఇవాళ 5 వేలకు చేరువలో..

AP Corona Cases : ఏపీలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కేసులు.. ఆ రెండు జిల్లాల్లో వెయ్యికిపైగా నమోదు

Ap Corona Cases

Updated On : January 15, 2022 / 5:03 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న 4వేల 528 కేసులు నమోదవగా ఇవాళ 5 వేలకు చేరువలో కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో 35వేల 673 కరోనా టెస్టులు చేయగా, 4వేల 955 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరొకరు కరోనాతో చనిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు.

Covid 3rd Wave : పిల్లలపైనే ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువ.. ఎందుకంటే? నిపుణుల మాటల్లోనే..!

అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 397 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22వేల 870కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 509కి పెరిగింది.

తాజాగా నమోదైన కేసుల్లో రెండు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖలో వెలుగుచూశాయి. విశాఖపట్నం జిల్లాలో 1103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1039 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

Omicron-Cyber attack: బీ కేర్ ఫుల్.. ఒమిక్రాన్‌నూ వదలని సైబర్ చీటర్లు.. క్లిక్ చేస్తే మొత్తం దోచేస్తారు..!

నేటి వరకు రాష్ట్రంలో 3,18,32,010 కరోనా టెస్టులు చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 21,01,710కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,64,331.