Free Coaching For Bank Exams : బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్, ఫ్రీగా కోచింగ్

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సర్వీసెస్‌(IBPS) పరీక్షల కోసం సిద్ధమవుతున్న

Free Coaching For Bank Exams : బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్‌న్యూస్, ఫ్రీగా కోచింగ్

Free Coaching For Bank Exams

Updated On : July 9, 2021 / 7:22 AM IST

Free Coaching For Bank Exams : బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ స్టడీ సర్కిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సర్వీసెస్‌(IBPS) పరీక్షల కోసం సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని ఏపీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో అడ్మిషన్ కోసం ఆగస్టు 1న ఆన్ లైన్ లో ప్రీ క్వాలిఫయింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 22లోపు https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వార్షిక ఆదాయం రూ.6లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామంది.

ఇటీవల బ్యాంకు ఉద్యోగాలకు విపరీతమైన పోటీ పెరిగింది. మంచి శాలరీతో పాటు ఉద్యోగ భద్రత ఉండడంతో ఈ జాబ్స్ సాధించేందుకు అనేకమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా, బ్యాంకు ఉద్యోగాల కోచింగ్ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలాంటి వారికి ఏపీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఐబీపీఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు వెల్లడించింది.