జగన్‌..మాటిచ్చి తప్పారు : ఇది రైతుల సమస్య కాదు..రాజధాని సమస్య 

  • Published By: veegamteam ,Published On : December 24, 2019 / 06:33 AM IST
జగన్‌..మాటిచ్చి తప్పారు : ఇది రైతుల సమస్య కాదు..రాజధాని సమస్య 

Updated On : December 24, 2019 / 6:33 AM IST

సీఎం జగన్ పిల్ల చేస్టలతో మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసేసి వేడుక చూస్తున్నారనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజలకు మంచి పాలన అందిస్తానని..ప్రజలతో ఓట్లు వేయించుకుని సీఎం అయిన జగన్   ఇప్పుడు మాట తప్పారనీ..ఓట్లు వేసిన ప్రజలనే అష్టకష్టాలు పాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ పాలనలో కక్షసాధింపు ధోరణి కనపడుతోందన్నారు. జగన్‌వి పిల్ల చేష్టలని ఆయన మండిపడ్డారు. ఇది రైతుల సమస్య కాదని.. రాజధాని సమస్య అనీ..ఈ విషయాన్ని జగన్ అర్థంచేసుకోవాలని సూచించారు. 

రాష్ట్రానికి సీఎం మారితే రాజధాని మారుతుందనే వింత వైఖరిని సీఎం జగన్ తీసుకొచ్చారనీ..ఇది కేవలం అమరావతి ప్రాంత రైతుల సమస్య ఒక్కటే కాదనీ..రాష్ట్రానికి అతి కీలకమైన రాజధాని సమస్య అని.. ఇలాంటి పిచ్చి పనులు సరికావని  భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 

రాజధాని రైతులు కన్నాను కలిసారు. రాజధాని అమరావతిలోనే ఉండేలా ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని రైతులు కన్నా లక్ష్మీనారాయణను కోరుతు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కన్నా సీఎం జగన్ పై మండి పడ్డారు.
 
రాజధాని విషయంలో కేంద్రం హెచ్చరించినా జగన్‌ నియంతృత్వ ధోరణితో వెళ్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.