Cm Chandrababu : త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్రప్రదేశ్- సీఎం చంద్రబాబు

2047 నాటికి స్వర్ణాంధ్ర కోసం పని చేస్తున్నామన్నారు.

Cm Chandrababu : త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఆంధ్రప్రదేశ్- సీఎం చంద్రబాబు

Updated On : January 13, 2025 / 12:48 AM IST

Cm Chandrababu : రానున్న రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలోనే ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు మొన్నే శంకుస్థాపన జరిగిందని, 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తామని చంద్రబాబు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో సీఎన్జీ వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భవిష్యత్తులో సీఎన్జీ వాహనాలకు పెద్ద పీట వేస్తామన్నారు.

ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి..
అంతకుముందు తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. హైవేలు, సముద్ర తీరం, పోర్టులు, విమానాశ్రయాలతో రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయని అన్నారు. ఇంటింటికి గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామని చంద్రబాబు చెప్పారు.

2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు..
2047 నాటికి స్వర్ణాంధ్ర కోసం పని చేస్తున్నామన్నారు. తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఓ లబ్దిదారుడి ఇంటికి వెళ్లి స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టారు. స్వయంగా ఆయనే టీ చేశారు. అనంతరం పైప్ లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడా గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లె వెళ్లారు. అక్కడే మూడు రోజుల పాటు కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

 

Also Read : తిరుమల తొక్కిసలాట ఘటనపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది: జగన్