YSRCP Rebel MLAs : హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు..
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

AP YSRCP Rebel MLAs File Lunch Motion Petition in High Court
YSRCP Rebel MLAs : పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు పిటిషన్‌ను దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
గంటా శ్రీనివాసరావు పిటిషన్‌పై విచారణ వాయిదా..
తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ గంటా శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నోటీసులు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణనను మూడు వారాలకు వాయిదా వేసింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉంది. అయితే.. గత మంగళవారం రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. అయితే.. ఈ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.