ప్రత్యేక బస్సులు…ఏపీఎస్ఆర్టీసీ ప్రకటన

దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం…హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఇవాళ(అక్టోబర్-6,2019) ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల అవసరాల మేరకు రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్ నుంచి 110, బెంగుళూరు నుంచి 30, చెన్నై నుంచి 10 బస్సు సర్వీసులను ఏపీకి నడపనున్నట్లు ఆయన తెలిపారు.
అయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో బస్సులు రెండో రోజు కూడా డిపోలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దీంతో పండుగలకు స్వస్థలాలకు వెళ్లేవారు…అందుబాటులో ఉన్న బస్సులను ఆశ్రయిస్తున్నారు. అధికధరలు చెల్లించి మరీ ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.