మంచు మనోజ్‌-మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఖాయమా? టీడీపీలోకి వెళ్తారా.. జనసేనకు జై కొడతారా?

మోహన్‌బాబు ఇంట్లో వివాదాల తరువాత మరో పొలిటికల్ గాసిప్ మార్మోగుతోంది.

మంచు మనోజ్‌-మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఖాయమా? టీడీపీలోకి వెళ్తారా.. జనసేనకు జై కొడతారా?

Manchu Manoj and Mounika

Updated On : December 16, 2024 / 8:57 PM IST

మంచు మనోజ్ -మౌనిక పాలిటిక్స్‌లోకి రానున్నారా.. భూమా మౌనిక.. భూమా రాజకీయ వారసత్వం పుంచుకుంటారా.. కుటుంబ గొడవల్లో రాజకీయ అండ కోసమే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా.. ఒకవేళ ఇదే నిజమైతే.. ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? ఏ నియోజకవర్గం నుంచి పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారు…

వారం నుంచి మంచు ఫ్యామిలీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మోహన్‌బాబు కుటుంబ ఆస్తుల లొల్లి రోడ్డెక్కి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ వ్యవహారంలో కొత్త గాసిప్ వినిపిస్తోంది. మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్త నంద్యాల జిల్లాలో రీసౌండ్‌ చేస్తోంది..

భూమా ఫ్యామిలీ మొదటి నుంచి రాజకీయాల్లోనే ఉంది. ఇప్పటికే భూమా అఖిలప్రియ భూమా రాజకీయ వారసురాలిగా ఉంది. ఇటు మంచు ఫ్యామిలీకి కూడా పాలిటిక్స్ కొత్తేమి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోహన్ బాబు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉంటూ.. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అంతేకాకుండా మంచు విష్ణు భార్య జగన్‌కు దగ్గరి బంధువు.. దీంతో ఇరు కుటుంబాలకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పడు మోహన్‌బాబు మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో పార్టీకి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు.

పొలిటికల్ గాసిప్
తాజాగా మోహన్‌బాబు ఇంట్లో వివాదాల తరువాత మరో పొలిటికల్ గాసిప్ మార్మోగుతోంది. మనోజ్‌కి ఎలా అయితే ఆస్తుల గొడవలు ఉన్నాయో మౌనికకు తన అక్క అఖిల ప్రియతోనూ ఆస్తి తగాదాలు ఉన్నాయంట. ఈ వివాదాలతోనే అక్కకు దూరంగా ఉంటుందంట మౌనిక. దీంతో వీటన్నింటి నుంచి బటయపడేలా రాజకీయ అండ కోసం ఓ పొలిటికల్ పార్టీలో చేరాలని వారిద్దరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే నిజమైతే ఏ పార్టీ కండువా కప్పుకుంటారు. ఏ నియోజకవర్గం నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెడతారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. భూమా మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె తల్లి శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించారు.

అక్కడి నుంచి రాజకీయాల్లో అఖిల ప్రియ
అయితే.. తల్లి మరణం తర్వాత మౌనిక సోదరి అఖిల ప్రియ అక్కడి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాలలో నాగిరెడ్డి మరణం తర్వాత.. ఆయన అన్నకొడుకు బ్రహ్మానందరెడ్డిని భూమా ఫ్యామిలీ ఎంపిక చేసింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ఐతే నంద్యాల కూడా తమ చేతుల్లోనే ఉండాలని భూమా ఫ్యామిలీ భావిస్తోంది. ఇందుకోసం మౌనికను రంగంలోకి దింపాలని చూస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్‌కి మనోజ్ మొదటి నుంచి క్లోజ్‌గా ఉంటూ వస్తున్నాడు. ఇటు మోహన్ బాబుకు చెక్ పెట్టాలంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనలో జాయిన్ అవ్వడం బెటర్ ఆప్షన్‌ అని మనోజ్ -మౌనిక ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది వట్టి ప్రచారమేనా.. లేదంటే.. నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అన్నది వేచి చూడాలి.

Jogi Ramesh: టీడీపీ వైపు జోగి రమేశ్‌ అడుగులు.. జోగికి టీడీపీ హైకమాండ్ వెల్‌కమ్‌ చెబుతుందా?