Indrakiladri : జూన్ 19 నుంచి ఇంద్రకీలాద్రిపై ‘ఆషాడమాసం సారె’ ప్రారంభం..

జూన్ 19వ తేదీ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమవుతుందని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు.

Indrakiladri : జూన్ 19 నుంచి ఇంద్రకీలాద్రిపై ‘ఆషాడమాసం సారె’ ప్రారంభం..

vijayawada indrakeeladri

Updated On : June 10, 2023 / 4:02 PM IST

Vijayawada Durgagudi: జూన్ 19వ తేదీ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం (Ashada Masam) సారె ప్రారంభమవుతుందని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు (Karnati Rambabu), ఈవో భ్రమరాంబ (Bramaramba) తెలిపారు. జూలై 1, 2, 3 తేదీలలో ఇంద్రకీలాద్రి‌ (Indrakiladri)పై శాకంబరీ దేవి (Shakambari devi) ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు.

ప్రతి ఏడాది ఆషాడమాసంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శాకంబరీ ఉత్సవాలకు కూరగాయలు, పండ్లు దాతల ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు. జూలై 2న దుర్గమ్మ‌కు ఆషాడ మాసం సారెను, బంగారపు బోనంను హైదరాబాద్ మహంకాళి బోనాల కమిటీ సమర్పించనుందని దుర్గగుడి చైర్మన్ తెలిపారు.

Kerala Welcomes Monsoon : కేరళను తాకిన రుతుపవనాలు.. వర్షం కోసం ముంబయి ఎదురుచూపులు

సుమారు 5000 మంది భక్తులతో, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, బేతాళ వేషాలుతో తరలివచ్చి హైదరాబాద్ మహంకాళి బోనాలు కమిటీ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జులై 14వ తేదీన హైదరాబాద్ బోనాల కమిటీ వాళ్లు నిర్వహించే ఎనిమిది గ్రామ దేవతల ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులను మహంకాళి అమ్మవారి బోనాల కమిటీ ఆహ్వానించినట్లు తెలిపారు.