Ashok Gajapathi Raju : సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు

సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కేంద్ర మాజీమంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఈరోజు ఉదయం సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నగోశాలను సందర్శించారు.

Ashok Gajapathi Raju : సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju

Updated On : June 16, 2021 / 9:50 AM IST

Ashok Gajapathi Raju : సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని కేంద్ర మాజీమంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఉన్నగోశాలను సందర్శించారు. పీవీజీ రాజు గారి విగ్రహానికి పూలమాల వేసి గోశాలలో మొక్కలు నాటారు.

సంచైత గజపతి నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో 15 నెలల తరువాత అశోక్ గజపతి రాజు అప్పన్న ను దర్శించుకున్నారు. అశోక్ గజపతిరాజును గతేడాది మార్చినెలలో ప్రభుత్వం అక్రమంగా ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తొలగించింది.

తిరగి అశోక్ గజపతిరాజునుచైర్మన్ గా నియమిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మొదటి సారిగా చైర్మన్ హోదాలో ఆయన ఈరోజు ఆలయానికి విచ్చేశారు.  ఆయన  వెంట కుమార్తె  అదితి గజపతి రాజు కూడా ఉన్నారు. ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు.