ప్రైవేట్ కు గౌతమి, గోదావరి సూపర్ ఫాస్ట్ రైళ్లు

  • Published By: bheemraj ,Published On : December 15, 2020 / 11:46 AM IST
ప్రైవేట్ కు గౌతమి, గోదావరి సూపర్ ఫాస్ట్ రైళ్లు

Updated On : December 15, 2020 / 12:03 PM IST

Gautami and Godavari trains to private : విజయవాడ రైల్వే డివిజన్లలో గోదావరి, గౌతమి సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రైవేట్ కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు డివిజన్ అధికారులు దీనికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.

ప్రైవేట్ కు అప్పగించే ప్రయత్నాల్లో భాగంగా గోదావరి, గౌతమి ఎక్స్ ప్రెస్ రైళ్లలోని కోచ్ లు అన్నింటినీ ఏసీగా మార్చాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే కనక ఆ రైళ్లలో జనరల్, స్లీపర్ కోచ్ లు ఉండవు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ తర్వాత మిగిలిన కోచ్ లన్నీ థర్డ్ ఏసీ గానే ఉంటాయి.

దీంతో పేద వర్గాలకు ఈ రైళ్లు దూరం కావడమేగాక మధ్యతరగతి వర్గాలకు ప్రయాణం భారంగా మారనుంది. ఇటీవల బిడ్డర్లతో నిర్వహించిన సమావేశంలో జరిగిన రహస్య ఒప్పందాల్లో ఈ రైళ్ల ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.