Panchumarthi Anuradha : చేనేతలకు అండగా ఉంటాం.. దాడి చేసిన వైసీపీ నాయకుడిని కఠినంగా శిక్షించాలి : పంచుమర్తి అనురాధ
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ దాడికి గురైన వ్యాపారులను పరామర్శించారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధా మాట్లాడుతూ చేనేత వ్యాపారులు అమాయకులనే వారిపై దాడులు చేశారని పేర్కొన్నారు.

Panchumarthi Anuradha
Avinash Attack Silk Saree Traders : దాడికి నిరసనగా పట్టుచీరల వ్యాపారులు వారం రోజులపాటు ధర్మవరం బంద్ కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దాడికి నిరసనగా బంద్ పాటిస్తున్నట్లు పట్టు చీరల వ్యాపారులు ప్రకటించారు. ధర్మవరంలో చేనేత వ్యాపారుల బంద్ కి టీడీపీ నేతల మద్దతు తెలిపింది. ఈ మేరకు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ దాడికి గురైన వ్యాపారులను శ్రీ సత్యసాయి జిల్లా దర్మవరంలో పరామర్శించారు. మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే కందికుంట కూడా బాధిత వ్యాపారులను పరామర్శించారు.
ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధా మాట్లాడుతూ చేనేత వ్యాపారులు అమాయకులనే వారిపై దాడులు చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి బాధితులు ఇంటి వద్దకు వచ్చి ఉంటే హర్షించే వాళ్లం.. కానీ, వారిని తమ ఇంటి వద్దకు పిలిపించుకున్నాడని తెలిపారు. తాము దీనిపై పెద్ద ఎత్తున స్పందించిన తర్వాతే విజయవాడ వ్యాపారి అవినాష్ ను అరెస్టు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే విజయవాడకు వెళ్లి ధర్నా చేసేవారని విమర్శించారు.
Dharmavaram Bandh : దాడికి నిరసనగా.. పట్టుచీరల వ్యాపారులు వారం రోజులు ధర్మవరం బంద్ కు పిలుపు
ఆ రోజు జోలె పట్టుకుని ధర్మవరం వచ్చారు.. ఈరోజు గుర్రాల కోట కట్టుకున్నారని ఆరోపించారు. చేనేతలను భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. కచ్చితంగా తాము చేనేతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పట్టు చీరల వ్యాపారులపై దాడి చేసిన వైసీపీ నాయకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్మవరం చేనేతలకు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విజయవాడకు చెందిన వ్యాపారి, వైసీపీ నేత అవినాష్ పట్టు చీరల వ్యాపారులపై దాడి చేశారు. చీరలకు సంబంధించిన డబ్బులు అడిగినందుకుగానూ పట్టు చీరల వ్యాపారులను అవినాష్ ఘోరంగా అవమానించారు. వ్యాపారుల దుస్తులు తీసివేసి, అవినాష్ దాడి చేశారు. పట్టు చీరల వ్యాపారులపై అవినాష్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమాయక వ్యాపారులపై దాడికి నిరసనగా చేనేత వ్యాపారుల బంద్ పాటిస్తున్నారు.