Guntur : గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య
గుంటూరు పట్టణంలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు.. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు

Guntur (2)
Guntur : గుంటూరులోని కాకాణి రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా పొడిచి హత్యచేశాడు. ఓ ప్రయివేట్ కాలేజీలో విద్యార్థిని నల్లపు రమ్య బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. హత్యవిషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. హత్యచేసిన యువకుడికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో గుంటూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.