CM Jagan : వచ్చే రెండు నెలలు జాగ్రత్త, పెళ్లిళ్లకు 150 మందికి మించొద్దు

రాష్ట్రంలో కొవిడ్ నివారణ, వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తక్కువమంది

CM Jagan : వచ్చే రెండు నెలలు జాగ్రత్త, పెళ్లిళ్లకు 150 మందికి మించొద్దు

Cm Jagan

Updated On : August 2, 2021 / 4:47 PM IST

CM Jagan : రాష్ట్రంలో కొవిడ్ నివారణ, వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తక్కువమంది హాజరు కావాలని తెలిపారు. వివాహాలకు వచ్చేవారిని 150 మందికే పరిమితం చేయాలని ఆదేశించారు. మరికొన్ని నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇకపై ఆర్టీ-పీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు గడువులోగా పూర్తి కావాలని స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్ లో 45 ఏళ్లు దాటినవారికి, గర్భిణులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తెరుస్తున్నందున, వ్యాక్సినేషన్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కొవిడ్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు.

నిత్యం కొత్త రూపాలు మార్చుకుంటూ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచ దేశాలు మరోసారి వణికిపోతున్నాయి. డెల్టా వేరియంట్‌ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా సహా పలు దేశాల్లో కొన్ని రోజలుగా మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి.

ఇక కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా తేరుకోనేలేదు.. ఇప్పటివరకు తగ్గుముఖం పట్టినా కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఆందోళనకు గురిచేస్తోంది. పది రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటీవిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని మరోసారి రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించింది. 46 జిల్లాల్లో 10%కి పైగా, 53 జిల్లాల్లో 5-10% మధ్య పాజిటివిటీ రేటు ఉన్నట్టు తెలిపింది. దేశంలో ఆగస్ట్‌లోనే థర్డ్‌ వేవ్‌ ప్రారంభమై.. అక్టోబర్‌ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందనే హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

డెల్టా వేరియంట్ వల్ల భారత్ కు త్వరలోనే ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్ లోనే థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. రెండు దశల మధ్య గ్యాప్, తీవ్రత, కేసుల పెరుగుదల ఆధారంగా అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 130 దేశాలకు పాకిన ఈ వేరియంట్.. అమెరికా, జపాన్, మలేషియా, ఇరాన్ లో ప్రతాపం చూపిస్తోంది.