TG Venkatesh : టీజీ ఇంటి పేరు కల వాళ్లంతా నా బంధువులు కాదు-టీజీ వెంకటేష్

హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10 లోని ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ కు పక్కన ఉన్న స్ధలం వివాదంలో, తనకెటు వంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ,  రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చెప్పారు

TG Venkatesh : టీజీ ఇంటి పేరు కల వాళ్లంతా నా బంధువులు కాదు-టీజీ వెంకటేష్

Tg Venkatesh

Updated On : April 20, 2022 / 12:23 PM IST

TG Venkatesh : హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10 లోని ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ కు పక్కన ఉన్న స్ధలం వివాదంలో, తనకెటు వంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ,  రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చెప్పారు.  ఈరోజు ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ ఆ భూమి విషయంగా  రెండు వర్గాలమధ్య చాలాకాలంగా గొడవ నడుస్తోందని అన్నారు.

టీజీ విశ్వప్రసాద్ నాకు దూరపుబంధువు. అంత మాత్రాన టీజీ విశ్వప్రసాద్ తో అన్నివిషయాల్లో సంబంధం ఉంటుందనేది వాస్తవంకాదని ఆయన చెప్పారు. టీజీ విశ్వ ప్రసాద్ ఇప్పటికే ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు, నాకు ఏమి సంబంధంలేదని అయినా నా పేరు పెట్టారు అని వెంకటేష్ అన్నారు.
Also Read : India Covid : భారత్‌లో కొత్తగా 2,067 కోవిడ్ కేసులు
విశ్వ ప్రసాద్ మా తాతగారి వంశంలోని పిల్లలకు చెందిన వ్యక్తి.  ఈవివాదంలోనాకు ఏమి సంబంధం లేదు. నేను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి లక్షద్వీప్ కు వెళ్లాను ఆసమయంలో ఈ ఘటన జరిగింది నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈనెల 17 రాసిన ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు. 18న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం నా పేరు పెట్టారని వెంకటేష్ అన్నారు.