India Covid : భారత్‌లో కొత్తగా 2,067 కోవిడ్ కేసులు

భారత్ లోనిన్న కొత్తగా 2,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ నుంచి నిన్న1547 మంది కోలుకున్నారు.

India Covid : భారత్‌లో కొత్తగా 2,067 కోవిడ్ కేసులు

India Covid

Updated On : April 20, 2022 / 10:38 AM IST

India Covid : భారత్ లోనిన్న కొత్తగా 2,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ నుంచి నిన్న1547 మంది కోలుకున్నారు. నిన్నటి కంటే 65 శాతం కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది.

ప్రస్తుతం దేశంలో 12,340 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 4,30, 47, 592 కోవిడ్ కేసులు నమోదు కాగా…. 5,22,006 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. కోవిడ్ నుంచికోలుకున్నవారి సంఖ్య 4,25,13,248కి చేరింది.

Also Read : Delhi Covid : పెరుగుతున్న కోవిడ్ కేసులు- నేడు ఢిల్లీ ప్రభుత్వం కీలక సమావేశం