JP Nadda : నేడు ఏపీకి జేపీ నడ్డా..పవన్ కళ్యాణ్ అంశాన్ని ప్రస్తావిస్తారా?
ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగనుంది.

Jp Nadda
JP Nadda AP tour : ఏపీలో బీజేపీని పటిష్టం చేసే దిశగా అధిష్టానం దృష్టి సారించింది. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే…మేధావులు, పలువురు ప్రముఖులతో భేటీ కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ఏపీకి వస్తున్నారు. రెండు రోజుల పాటు పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు జేపీ నడ్డా గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. ఆయనకు రాష్ట్ర నేతలు స్వాగతం పలకనున్నారు.
ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 12.15 నిముషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్‌లతో సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు మేధావులతో జేపీ నడ్డా సమావేశం అవుతారు.
J.P.Nadda: జేపీ నద్దా ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే
ఇక రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు హోటల్‌లో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 7.30 నిముషాలకు జేపీ నడ్డా విజయవాడలో దుర్గమ్మను దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి రాజమండ్రి వెళ్లనున్నారు.
బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ, రోడ్ మ్యాప్ పై జేపీ నడ్డా మాట్లాడనున్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి సిఎం అభ్యర్థి గా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని ఇప్పటికే జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల నడ్డా పర్యటనలో పవన్ కళ్యాణ్ అంశాన్ని ప్రస్తావిస్తారా? లేదా అనే అంశంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.