Purandeswari : రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : పురంధేశ్వరి

ప్రజలు విచక్షణతో అభివృద్ధిని కోరుకుని ఓటేశారని వెల్లడించారు. బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించారని తెలిపారు.

Purandeswari : రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ జెండా ఎగురవేస్తాం : పురంధేశ్వరి

Daggubati Purandeswari

Daggubati Purandeswari – AP BJP : రాబోయే‌ ఎన్నికల్లోనూ ఏపీలో వైసీపీ అవినీతిని ఎండగట్టి బీజేపీ జెండా ఎగురవేస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. కార్యకర్తలతో కలిసి దగ్గుబాటి పురంధేశ్వరి విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

రాజస్థాన్ ఎన్నికల్లో 42 % ఓటు శాతం బీజేపీ సాధించిందని తెలిపారు. మధ్యప్రదేశ్ లో 160 సీట్లతో 49% ఓటు షేర్ బీజేపీ సాధించిందని పేర్కొన్నారు. చత్తీస్ ఘడ్ లో 46% ఓటు షేర్ బీజేపీ సాధించిందని వెల్లడించారు. తెలంగాణలోనూ తాము అద్భుతమైన విజయం సాధించామనే భావిస్తున్నామని తెలిపారు.

Congress : కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు విజయం

కామారెడ్డిలో తమ అభ్యర్ధి వెంకటరమణారెడ్డి కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి గెలిచారని పేర్కొన్నారు. ప్రజలు సుపరిపాలనకు ఓటేశారని తెలిపారు. ప్రజలు విచక్షణతో అభివృద్ధిని కోరుకుని ఓటేశారని వెల్లడించారు. బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించారని తెలిపారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. ఎన్నికల కమిషన్ కు అభినందనలు తెలిపారు.

చిన్న సమస్య కూడా లేకుండా సజావుగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. ఎన్నికల వేళ డబ్బు, వివిధ తాయిలాల రూపంలో పట్టుకున్న సొత్తు విలువ రూ.1760 కోట్లు ఉందన్నారు. రూ.1760 కోట్లలో రూ.660 కోట్లు తెలంగాణలోనివేనని స్పష్టం చేశారు.