YS Jagan : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత..

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ..

YS Jagan : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత..

YS Jagan Mohan Reddy house

Updated On : September 22, 2024 / 1:20 PM IST

YS Jagan Mohan Reddy: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో హిందూ వాదులు, బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులు వెల్లడయ్యాయి. ఈ విషయంపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో హిందూవాదులు, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జగన్ నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. తాడేపల్లి జగన్ నివాసం ఇంటి గేటుపై చెప్పులు విసరడంతోపాటు.. గేటుకు కాషాయం రంగు పూసి తమ నిరసన తెలియజేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకిదిగి నిరసన కారులను అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also Read : Manchu Manoj : తిరుమ‌ల ల‌డ్డూ వివాదం పై మంచు మ‌నోజ్‌.. లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ..

తాడేపల్లిలోని జగన్ ఇంటిపై దాడిని వైసీపీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు తగవని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నివాసం గేట్లకు పూసిన కాషాయ రంగును సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే, బీజేవైఎం కార్యకర్తల దాడిలో సెక్యూరిటీ రూమ్స్ అద్దాలు ధ్వంసమైనట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. తాడేపల్లిలోని నివాసంపై దాడి జరిగిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఆ నివాసంలో లేరు. శుక్రవారమే జగన్ బెంగళూరు వెళ్లినట్లు తెలిసింది.