Botsa On Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ అంశం పూర్తిగా సీఎం జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని చెప్పారు. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా..(Botsa On Cabinet Expansion)

Botsa On Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Botsa On Cabinet Expansion

Updated On : March 30, 2022 / 7:28 PM IST

Botsa On Cabinet Expansion : ఏపీ కేబినెట్ విస్తరణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ విస్తరణకు సీఎం జగన్ అంతా సిద్ధం చేశారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. దీంతో మంత్రివర్గంలో ఉండేది ఎవరు? ఊడేది ఎవరు? అనేది ఇప్పుడు ఆసక్తికరగా మారింది. ఈ క్రమంలో కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌పై వైసీపీ సీనియర్ నేత, పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ అంశం పూర్తిగా సీఎం జ‌గ‌న్ ఇష్ట‌మ‌ని ఆయన చెప్పారు. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా గౌరవిస్తామని, అందుకు అనుగుణంగానే సాగుతామ‌ని చెప్పారు.

“కేబినెట్‌పై నాయ‌కుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కూర్పు అంటే ఎన్నో స‌మీక‌ర‌ణాలు ఉంటాయి. పార్టీ బ‌లోపేతం కోసం క‌లిసికట్టుగా ప‌నిచేస్తాం. సీఎం జ‌గ‌న్ ఎలా చెబితే అలా ముందుకు సాగుతాం” అని బొత్స అన్నారు.(Botsa On Cabinet Expansion)

AP Cabinet : ఏపీ కేబినెట్‌ విస్తరణకు కౌంట్‌డౌన్..ఏప్రిల్‌ 7న మంత్రివర్గం భేటీ..తేలిపోనున్న సిట్టింగ్‌ మంత్రుల భవితవ్యం

”కేబినెట్ విస్తరణపై జగన్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. అది ఆయన ఇష్టం. పార్టీని బలోపేతం చెయ్యడం, అధికారంలోకి తేవడం మా అందరి బాధ్యత. 90 శాతం మంది మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారు. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము గౌరవిస్తాం” అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు డేట్‌ ఫిక్స్‌ కావడంతో అటు మంత్రుల్లో.. ఇటు ఆశావహుల్లో మరింత టెన్షన్ పెరిగింది. ఏప్రిల్ 7న కేబినెట్‌ భేటీ కానుంది. అదే రోజు సిట్టింగ్‌ మంత్రుల భవిష్యత్‌ తేలిపోతుందనే చర్చ నడుస్తోంది. కొత్త కేబినెట్‌లో ఎవరు ఉంటారు.. ఎవరు బయటకు వెళ్తారనే దానిపై అదే రోజున క్లారిటీ రానుంది.

కొత్త మంత్రివర్గంలో కేవలం ఇద్దరు లేదా.. ముగ్గురు పాత మంత్రలు మాత్రమే ఉంటారని ఇప్పటికే సీఎం జగన్‌ క్లారిటీ ఇచ్చారు. 95 శాతం కొత్త కేబినెట్‌ కొలువుదీరనుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే.. జగన్‌ కేబినెట్‌లో మరో రెండేళ్లు కొనసాగే ఆ ఇద్దరు.. ముగ్గురు మంత్రులు ఎవరు…? ఎవరిని సిట్టింగ్‌లుగా కంటిన్యూ చేస్తారని వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

మరోవైపు.. అన్ని జిల్లాల నుంచి ఆశావహులు భారీగానే కేబినెట్‌లో స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. తమ సీనియారిటీ, కులాల ప్రాతిపదికన.. ఈ సారైనా తమకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక కొందరేమో.. తమకు కేబినెట్‌లో బెర్త్‌ కన్ఫామ్ అంటూ దీమాగా ఉన్నారు. అయితే.. వీటన్నింటికీ ఏప్రిల్‌ 7న ఎండ్‌ కార్డ్‌ పడుతుందని.. అదే రోజు కొత్త మంత్రివర్గంలో ఎవరు ఇన్‌.. ఎవరు ఔట్ అనేది తేలిపోతుందని తెలుస్తోంది.(Botsa On Cabinet Expansion)

AP Cabinet Expansion: డేట్ ఫిక్స్.. ఏపీ కేబినెట్ విస్తరణ ఆ రోజే..!

రకరకాల ఊహాగానాలకు దాదాపుగా తెరపడింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. తాడేపల్లి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 11న కేబినెట్ ను ముఖ్యమంత్రి జగన్ విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించి.. ఏప్రిల్ 8న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమై.. పూర్తి సమాచారాన్ని అందించనున్నారు. కేబినెట్ ను విస్తరించిన తర్వాత.. పాత, కొత్త మంత్రులందరికీ.. ముఖ్యమంత్రి జగన్ విందు ఇవ్వనున్నారు.