Botsa Satyanarayana : వచ్చే ఉగాది నాటికి ఆ రెండు పార్టీలు ఉండవు.. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదు : మంత్రి బొత్స

వాలంటీర్లపై కూడా మాట మార్చాడని పేర్కొన్నారు. రాత్రి ఒక మాట, పగలు ఒకమాట మాట్లాడుతున్నాడని తెలిపారు.

Botsa Satyanarayana : వచ్చే ఉగాది నాటికి ఆ రెండు పార్టీలు ఉండవు.. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదు : మంత్రి బొత్స

Botsa Satyanarayana

Updated On : August 11, 2023 / 8:38 PM IST

Botsa Satyanarayana – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. వచ్చే అమావాస్య( ఉగాది )నాటికి రెండు రాజకీయ పార్టీలు ఉండవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉండవని ఉంటే గుండు గీయించుకుంటానని చెప్పారు. ఎంతసేపు రాజకీయాలే తప్ప పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఎచ్చెర్ల నియొజకవర్గం గడపగడపకు విజయొత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు.

రాజకీయ అనుభవంతో చెబుతున్నా ప్రజలకు మంచి చెయాలనే తపన వారికి లేదన్నారు. ఎన్నికలు వస్తున్నప్పుడు స్కీములు గుర్తొస్తున్నాయని అంటున్నావని చెప్పారు. కిడ్నీ పేషెంట్ లకు ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేదు, ఒక్క హాస్పిటల్ ఇవ్వలేదన్నారు. నిర్వాసితులకు పరిహారం ఎదుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు.

SP Jashuava : కట్టుకున్న వాడే కాలయముడు.. మాచర్ల రాధను భర్తే హత్య చేశాడు

రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎందుకు అని అంటుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. జగన్ పెట్టమన్నారా….విజయమ్మ పెట్టమన్నారా ప్రజలు అభిమానంతో వైఎస్ విగ్రహాలు పెట్టుకున్నారని తెలిపారు. అవగాహనలేని చేతలు, మాటలు మాట్లాడే సెలబ్రెటీ పవన్ అని అన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానిపై మాటాడి పెద్ద వాడైపోయానుకుంటున్నాడని పేర్కొన్నారు.

‘నీ విధానం ఏంటి ? పార్టీ ఏంటంటే సమాదానం లేదు’ అని అన్నారు. దుఖానం తెరిచి 15 ఏళ్లు అయింది.. దుకాణంలో ఏ వస్తువు లేదు, క్వాలిటీ లేదు అని జనసేన పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. వాలంటీర్లపై కూడా మాట మార్చాడని పేర్కొన్నారు. రాత్రి ఒక మాట, పగలు ఒకమాట మాట్లాడుతున్నాడని తెలిపారు. సెట్ అయితే ఒక మాట, సెట్ కాకపొతే మరోమాట అని విమర్శించారు.