Accident In Nellore District: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Road Accidents
Accident In Nellore District: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చేడిమాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటోలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.
చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఆటోని వరగలి క్రాస్ రోడ్డు నుంచి చింతవరం వస్తున్న లారీ ఢీకొట్టింది. ఆటో నుజ్జునుజ్జుగా అయిపోగా.. గూడూరు సొసైటీ ప్రాంతానికి ఆటో డ్రైవర్ సుధాకర్ ఆటోలోనే ఇరుక్కుని మరణించారు. హరిసాయి, రాజశేఖర్ అనే ఇద్దరు లారీ చక్రాల కింద పడి చనిపోయినట్లుగా గుర్తించారు.
ఆటోలోని ప్రయాణికులు ఇద్దరూ గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందినవారిగా పోలీసులు చెబుతున్నారు. వీరు ఓ ఏజెన్సీలో పని చేస్తుండగా.. సంస్థకు సంబంధించిన సరకులను దుకాణాలకు వేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.