దారుణం : చెల్లెలు పై అత్యాచారం చేసిన అన్న

  • Published By: murthy ,Published On : August 25, 2020 / 10:05 AM IST
దారుణం : చెల్లెలు పై అత్యాచారం చేసిన అన్న

Updated On : August 25, 2020 / 11:09 AM IST

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకు పోయిన యువకుడు వరసకు చెల్లెలు అయ్యే బాలికపై అత్యాచారం చేశాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో చిలకా షడ్రక్(23) అనే యువకుడుఅదే గ్రామానికి చెందిన 11 ఏళ్ళ బాలికపై కన్నేశాడు.



ఆగస్ట్21, శుక్రవారం సాయంత్రం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. తల్లి తండ్రులు కూలి పనికి వెళ్లారు. ఈ విషయం తెలిసి షడ్రక్ ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను స్నానాల గదిలోకి తీసుకు వెళ్లాడు. అక్కడ ఎవరికీ కనపడటం లేదని నిర్ధారించుకుని బాలికపై అత్యాచారం చేశాడు.



సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి తండ్రులకు బాలిక జరిగిన సంఘటనను వివరించింది. దీంతో వారు అచ్చంపేట ఎస్సైకు ఫిర్యాదు చేశారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.