వీరిని ఏం చేయాలి : గన్నవరంలో బాలికపై అత్యాచారం

ఏపీలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కామాంధులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని పసిపిల్లలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. దిశా చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనబడడం లేదు. గుంటూరు జిల్లాలో నేపాల్ బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన మరిచిపోకముందే..మరో దారుణం వెలుగు చూసింది.
గత పది రోజుల వ్యవధిలో నాలుగో అత్యచార ఘటనగా చెప్పవచ్చు. వరుస ఘోరాలతో మహిళలు, చిన్న పిల్లల భద్రతపై సర్వాత్రా ఆందోళన నెలకొంది. కృష్ణా జిల్లాలో గన్నవరం మండలం కేసరపల్లి సుందరయ్య కాలనీలో బాలికను చిదిమేశాడు. నడకుర్తి శివ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం గన్నవరం పీఎస్‌లో కంప్లయింట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. నిందితులు పారిపోతుండగా పోలీసులు చేసిన ఎన్ కౌంటర్‌పై సర్వాత్రా హర్షాతీరేకాలు వ్యక్తమయ్యాయి. ఏపీలో దారుణ ఘటనలపై సీఎం జగన్ సర్కార్ స్పందించింది. చట్టానికి సవరణలు చేసింది. దీనికి దిశ అనే పేరు పెట్టింది.
* అత్యాచారానికి పాల్పడినా..చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినా ఈ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారు.
* నిర్ధారించే ఆధారాలు ఉంటే…21 రోజుల్లోనే తీర్పు వచ్చేలా బిల్లు రూపొందించారు.
* ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ..బిల్లు తీసుకొచ్చారు.
* మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.
Read More : AP Capital : రాజధాని గ్రామాల్లో జనసేన నేతల పర్యటన