Andhrapradesh : ఏపీలో దారుణం.. ప్రియురాలి శరీరాన్ని రెండు ముక్కలుగా చేసి.. ఒకభాగం ఫ్రిజ్‌లో.. మరొక భాగం.. ఒళ్లు గగురుపొడిచే ఘటన
Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని ప్లాట్‌కు పిలిచి, అత్యంత పాశవికంగా హత్య చేశాడు.
Brutal incident in Andhrapradesh
- విశాఖలోని గాజువాక ఎల్వి నగర్లో దారుణం
- ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
- కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని ప్లాట్‌కు పిలిచి, అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను రెండు ముక్కలుగా చేసి ఒకటి ఫ్రిడ్జ్‌లో మరొకటి సంచిలో దాచాడు. ఒళ్లుగగురుపొడిచే ఈ ఘటన విశాఖలోని ఎల్.వి.నగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Also Read : TDP Formation Day 2026 : చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ‘కార్యకర్తలని పట్టించుకోని నేతలు నాకు అక్కర్లేదు’
విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర (35) నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. విశాఖపట్టణంలోని ఓ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్నాడు. అతని భార్య నెల క్రితం విజయనగరంలో పుట్టింటికి వెళ్లింది. విశాఖకు చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. అయితే, వీరి మధ్య కొద్దిరోజులుగా గొడవులు జరుగుతున్నట్లు సమాచారం.
ఆదివారం రాత్రి రవీంద్ర తన ప్రియురాలు మౌనికను విశాఖపట్టణంలోని తన ప్లాట్ కు పిలిచాడు. ఆమె వచ్చిన తరువాత వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో రవీంద్ర అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. మౌనికను హత్యచేసి ఆమె శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఒక భాగం ఫ్రీజ్‌లో పెట్టాడు. మరోభాగాన్ని సంచిలో దాడు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
పోలీసులు నిందితుడిని వెంట పెట్టుకొని తన ప్లాట్ కు వెళ్లాడు. ఫ్రీజులో రెండు మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అయితే, తల భాగం కనిపించలేదని తెలుస్తోంది. రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో మౌనిక తనను డబ్బులకోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు.
