ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి వద్దకెళ్లారు.. ఇంటికొచ్చి చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.. పోలీసులు ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే.?

నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.

ఫోన్ పోయిందని జ్యోతిష్యుడి వద్దకెళ్లారు.. ఇంటికొచ్చి చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు.. పోలీసులు ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే.?

Updated On : June 26, 2025 / 11:32 AM IST

Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారికి అట్లకాడతో వాతలు పెట్టారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావటం.. పోలీసులు రంగంలోకి దిగడంతో చిన్నారి పట్ల మూర్ఖంగా ప్రవర్తించిన వారు కటకటాలపాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్‌చల్.. అడ్డొచ్చిన వారికి కత్తితో బెదిరింపు.. గంటకుపైగా నిలిచిపోయిన రైళ్లు.. వీడియో వైరల్

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం గ్రామం కాకర్లదిబ్బలో పదేళ్ల చిన్నారికి అట్లకాడను కాల్చి వాతలు పెట్టిన ఘటన చోటు చేసుకుంది. ఆ బాలిక తల్లిదండ్రులు ఉపాధికోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. దీంతో బాలిక మేనత్త దగ్గర ఉంటోంది. బాలికకు బంధువులే అయిన పొరుగింటి వారు తమ ఇంట్లో ఫోన్ పోవడంతో జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్లారు. మీ పక్కింట్లో ఉన్నవాళ్లే ఫోన్ దొంగిలించారని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు.

ఫోన్‌ను పక్కింట్లో ఉండే బాలికే దొంగిలించిందన్న అనుమానంతో.. బాలికను పిలిచి ప్రశ్నించారు. ఫోన్ ఎక్కడ దాచావో చెప్పాలంటూ బెదిరించారు. తనకు ఏమీ తెలియదని బాలిక ఎంత చెప్పినా వినకుండా అట్లకాడతో బాలిక నాలుక, మూతి, చేతులపై వాతలు పెట్టారు. ఈ ఘటనపై జూన్ 22న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని చిన్నారిని వైద్య చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.

 

ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. పోలీసులు చిన్నారిపై దాడికి పాల్పడి, అట్లకాడతో కాల్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్పందించారు. ఆ పాపకి చికిత్స జరిగి కోలుకునే వరకు అండగా ఉంటామని, వీపీఆర్ ఫౌండేషన్ తరపున అండగా నిలుస్తామని చెప్పారు. అయితే, బాలికపై హింసలో మేనత్త ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పాప కోలుకున్న తరువాత ఆమెను కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.