Road Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి గాయాలు కాగా

Car Accident
Vizianagaram District : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో విశాఖపట్టణం బయలుదేరారు. ఈ క్రమంలో కారు విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోని పోలిపల్లి వద్దకు రాగానే అతివేగంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.