TTD: టీటీడీ అధికారులతో సమీక్షంటూ కేంద్ర ప్రభుత్వ అధికారి హల్‌చల్‌.. అసలేం జరిగిదంటే..?

టీటీడీలో క్రౌడ్ మేనేజ్ మెంట్, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష జరుపుతారని సోమవారం అందుకు ఏర్పాట్లు చేయాలని ..

TTD: టీటీడీ అధికారులతో సమీక్షంటూ కేంద్ర ప్రభుత్వ అధికారి హల్‌చల్‌.. అసలేం జరిగిదంటే..?

TTD

Updated On : January 19, 2025 / 11:54 AM IST

TTD: తిరుమలలో తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని ఆరుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. కొద్దిరోజులకే స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలో ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే, టీటీడీలో ఘటనలపై తమ కంట్రోల్ రూంకు ఫిర్యాదులు వచ్చాయని, టీటీడీలో క్రౌడ్ మేనేజ్ మెంట్, భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష జరుపుతారని సోమవారం అందుకు ఏర్పాట్లు చేయాలని డైరెక్టర్ ఆశిష్ గవాయ్ శుక్రవారం టీటీడీ బోర్డు చైర్మన్ కు అధికారిక లేఖను పంపించారు.

Also Read: Saif Ali Khan Attack Case: సైఫ్‌పై దాడికేసులో నిందితుడు ముంబై ఎప్పడొచ్చాడు.. సైఫ్ ఇల్లని తెలిసే లోపలికి వెళ్లాడా.. పోలీసులు ఏం చెప్పారంటే..

కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన లేఖపై టీటీడీ రాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు కేంద్ర హోంశాఖ ముఖ్యులతో మాట్లాడి లేఖ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ స్పందిస్తూ ఆ లేఖతో తమకేమీ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. అంతేకాక.. సంజీవ్ కుమార్ సమీక్షపై ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లుగా కేంద్ర హోంశాఖ టీటీడీ ఈవోకు అధికారిక సమాచారం ఇచ్చింది. ఇదిలాఉంటే.. డైరెక్టర్ ఆశిష్ గవాయ్ నుంచి లేఖ ఎందుకు వచ్చిందనే విషయంపై అధికారులు ఆరా తీశారు.

Also Read: Amit Shah: జగన్‌మోహ‌న్ రెడ్డి ప్యాలెస్‌ల‌పై అమిత్ షా ఆరా.. చంద్రబాబు, లోకేశ్ ఏం చెప్పారంటే..?

కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటినకు వచ్చారు. శనివారం సాయంత్రం ఏపీకి వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో విందు ఇచ్చారు. ఆదివారం గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించారు. అయితే, అమిత్ షా పర్యటనలో భాగంగా కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన సంజీవ్ కుమార్ కూడా విజయవాడకు వచ్చారు. ఈ క్రమంలో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భావించిన ఆయన.. అధికారంగా తిరుపతిలో పర్యటించాలని భావించి.. క్రౌండ్ మేనేజ్ మెంట్ పై సమీక్ష పేరుతో డైరెక్టర్ స్థాయి అధికారితో లేఖ పంపించినట్లు తెలుస్తోంది.