AP Floods : వరదలు, కేంద్ర బృందం పర్యటన..ఫస్ట్ డే

కడప జిల్లాలోని పులపత్తూరు‌లో వరదల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీసింది. వరదకు సంబంధించిన ఫొటోలను పరిశీలించారు కేంద్ర బృందంలోని అధికారులు.

AP Floods : వరదలు, కేంద్ర బృందం పర్యటన..ఫస్ట్ డే

Ap Floods

Updated On : November 27, 2021 / 7:45 PM IST

Central team Tour AP : ఏపీలో వరద పరిస్థితులను అంచనా వేయడానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం చిత్తూరు, కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో  పర్యటించింది. కడప జిల్లాలోని పులపత్తూరు‌లో వరదల వల్ల జరిగిన నష్టంపై ఆరా తీసింది. వరదకు సంబంధించిన ఫొటోలను పరిశీలించారు కేంద్ర బృందంలోని అధికారులు. కలెక్టర్ విజయరామరావు, జేసీ గౌతమి కేంద్రబృందానికి వరద నష్టంపై వివరించారు. అటు  కేంద్ర బృంద సభ్యులు మనోహరన్, శివాని శర్మ, శ్రీనివాస్ వరద బాధితులను పరామర్శించారు.

Read More : Chandrababu : పార్లమెంటు సమావేశాలు.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలం మామడుగు గ్రామంలో జరిగిన పంటనష్టాన్ని పరిశీలించింది. అక్కడి కనికల్ల చెరువు ఆయకట్టు కింద 172 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. తమ గ్రామానికి వచ్చిన కేంద్ర బృందం సభ్యులకు గ్రామస్తులు తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. తమను ఆదుకోవాలని కోరారు. అటు, చంద్రగిరి మండలం కాశీపెంట, పెదపంజాణి మండలంలోనూ కేంద్ర బృందం పర్యటించింది. తిరుపతి సమీపంలోని రాయల చెరువును కూడా పరిశీలించింది.

Read More : Lecturer Beats Students : హోంవర్క్ చేయలేదని.. పైపులు, అట్టలతో విద్యార్థులను చితకబాదిన లెక్చరర్

మరోవైపు.. ఈ నెల 29న బంగాళాఖాతంలో అండమాన్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి సమీపించనుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 2021, నవంబర్ 27వ తేదీ శనివారం నుంచి ఈ నెల 30  వరకు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల వాసులు మళ్లీ వర్ష హెచ్చరికలతో భయాందోళన చెందుతున్నారు.