Chandrababu : పార్లమెంటు సమావేశాలు.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో..

Chandrababu : పార్లమెంటు సమావేశాలు.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu

Chandrababu : పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని పార్టీ ఎంపీలతో చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం ద్వారా పార్టీ ఎంపీలకు పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Microsoft Free Trick : ఈ ట్రిక్‌తో MS Office సాఫ్ట్‌వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, జ్యుడీషియల్‌ విచారణకి డిమాండ్ చేయాలని టీడీపీ భావిస్తోంది. ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో ఒత్తిడి తేవాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్‌ సరఫరా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఆదేశించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని సూచించారు. ఇక, పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మళ్లింపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు స్పష్టం చేశారు చంద్రబాబు.

అలాగే దేశంలోనే అత్యధికంగా ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై జగన్‌ ప్రభుత్వ పన్నులు, నిత్యావసర ధరల పెరుగుదల, ప్రత్యేకహోదా, 3 రాజధానుల బిల్లు వంటి అంశాలపై లేవనెత్తాలని చంద్రబాబు చెప్పారు. ఏపీలో వరి పంట వేయరాదని మంత్రులు ప్రకటించిన అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు చంద్రబాబు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి రూ.40 కోట్ల సుపారీ, అడ్వాన్సుగా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణకు పార్లమెంటులో డిమాండ్ చేయాలని ఎంపీలతో చెప్పారు చంద్రబాబు. ఇక బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని చెప్పారు.

UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలన్నారు. ఉపాధి హామీ నిధుల మళ్లింపు, ఈఏపీ నిధుల దారి మళ్లింపుపైనా ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు.