Chandrababu : ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు, సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ ఫేక్ సీఎం అన్నారు. ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

Chandrababu
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ ఫేక్ సీఎం అన్నారు. ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. అభ్యర్థులు కోర్టుకెళ్తే సీఎం, మంత్రులు జైలుకెళ్లాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. నామినేషన్లను బలవంతంగా ఉపసంహరింపజేశారని చెప్పారు. ప్రశ్నించే వారిపై బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Lose Weight : కసరత్తులు లేకుండా బరువు తగ్గటం ఎలాగో తెలుసా
స్థానిక సంస్థల ఎన్నికల్లో 2014లో 2 శాతం ఏకగ్రీవం అవగా, 2021లో అవి 24 శాతానికి ఎలా పెరిగాయని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతిలో నాడు జరిగిన 7వ వార్డు నామినేషన్ ఉపసంహరణలో సంతకాలు ఫోర్జరీ అని తేలిందన్నారు. దొంగ సంతకం పెట్టి జగన్ తిరుపతిలో గెలిచాడని ఆరోపించారు. ఫోర్జరీ వంటి అక్రమాల్లో జగన్ సిద్ధహస్తుడన్నారు. ఈ ఫోర్జరీ పై జగన్ ఏం చెబుతారని ప్రశ్నించారు.
Best Food : మాంసాహారాన్ని మించిన ఆహారం ఇదే…
జగన్ తన సీఎం పదవికి రాజీనామా చెయ్యాలన్నారు. తిరుపతి ఎన్నికల్లో ఫోర్జరీకి కారణమైన రిటర్నింగ్ అధికారిని అరెస్ట్ చెయ్యాలన్నారు చంద్రబాబు. ఇప్పుడు అదే తరహా కుట్రలు కుప్పంలో మొదలు పెట్టారని ఆరోపించారు. కుప్పం 14వ వార్డులో అక్రమాలతో నామినేషన్ వేయించి ఇలాగే ఏకగ్రీవం చేశారని చంద్రబాబు అన్నారు.